Braou.ac.in Home page
Go to Home

Registration for Alumni Association


      ప్రియమైన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థికి అభినందన పూర్వక నమస్కారం

      గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులను, ఆర్ధిక ఇబ్బందులతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేసిన వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సమున్నత లక్ష్యంతో దేశంలోనే మొట్ట మొదటిసారిగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని దూర విద్యా పితామహులు ప్రొ.జి. రామ్ రెడ్డి గారు స్థాపించిన విషయం మనకు తెల్సిందే. అందులో భాగంగానే గత 39 సంవత్సరాలుగా లక్షలాది మంది విద్యార్ధులను ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులను, గృహిణులు, కార్మికులను, కర్షకులను, నిరుపేదలను, ఇలా అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాం.

      మన యూనివర్సిటీలో అభ్యసించి చాల మంది సివిల్ సర్వెంట్స్ గా, గ్రూప్ -1, గ్రూప్- 2 అధికారులుగా, లెక్చరర్స్ గా, ఇలా అనేక ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డ విషయం మీకు తెలిసిందే. ఆర్ధికంగా వెనకపడ్డ వారికీ చేయాతనివ్వడమే మనందరి లక్ష్యం. ఈ విశ్వవిద్యాలయ లక్ష్య సాధనలో మీ వంతు కృషి అవసరం అయింది. ఇందులోనే అభ్యసించి ఉన్నత విద్యావంతులుగా గుర్తింపు పొందిన మీరు... మన విశ్వవిద్యాలయ అడ్మిషన్ల గురించి మీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు, ఇరుగు పొరుగు వారికీ, మీ చుట్టు పక్కల పని చేసుకునే కార్మికులకు, గృహిణులకు చెప్పి వారిని కూడా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యావంతులుగా మారెలా కృషి చేస్తూ మన లక్ష్యసాధనలో పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాం.

      2022-23 విద్యా సంవత్సరానికి మన విశ్వవిద్యాలయం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ, సర్టిఫికేట్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్లు జరగుతున్నాయి. విద్యార్థులు వారి వారి కనీస అర్హతల ప్రకారం విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం, UGC నిబంధనల ప్రకారం ఉన్నత విద్యా కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. జిల్లాల వారిగా RCC ల వివరాలు, స్టడీ సెంటర్ల లిస్ట్, కోర్సుల వివరాలు, అడ్మిషన్ ప్రక్రియ, ఫీజు తదితర అంశాలతో కూడిన నోటిఫికేషన్ విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ :www.braouonline.inలో అందు బాటులో ఉంది. మరేదైనా సమాచారం కావాలన్నా యూనివర్సిటీ హెల్ప్ డెస్క్ నంబర్లు 7382929570/580/590/600 లేదా 040-23680281/283 ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.

      మన విశ్వవిద్యాలయం నిర్దేశించుకున్న లక్య సాధనలో ఉన్నత విద్యావంతులుగా, ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిగా మీ సహకారాన్ని అందించి ఈ బృహత్తర యజ్ఞంలో మీరూ భాగస్వాములు అవుతారాని ఆకాంక్షస్తున్నాం. అదేవిధంగా విశ్వవిద్యాలయంలో అభ్యసించి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థుల (ALUMNI) అసోసియేషన్ ను ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ భావిస్తోంది. అందుకుగాను మీ పూర్తి వివరాలను, ప్రస్తుత ఉద్యోగం, హోదా, ఫోన్ నంబర్, పూర్తి పోస్టల్ అడ్రస్ ను మాకు ఇమెయిల్ ద్వార పంపించగలరు. ఈ మెయిల్ ఐడి :braoualmuni@gmail.com.

  సం./                    
  - Dr AVN Reddy, రిజిస్ట్రార్.

  Dear alumnus,

       Greetings to you from Dr.B.R.Ambedkar Open University!

       Dr.B.R.Ambedkar Open University was the first Open University in the country established by Prof.G.Ram Reddy, the father of Distance Education in India, with the higher objective of reaching out to rural, disadvantaged sections of society and dropouts from higher education who could not complete their education due to financial problems. In realisation of this objective, for the last 39 years the University reached-out to Rural students, Poor students, House wives, labourers, farmers, marginalised sections etc., and helped them to achieve their goal of gaining higher education. Many of these people are now gainfully employed and are placed in prestigious positions in Government.

      Now the University requests your support and efforts in realisation of its objective of educating the disadvantaged. For attaining this objective, you are requested to inform your family members , friends, relatives, acquaintances, neighbors, house wives about admissions in Dr.BRAOU and request them to inform others who are disadvantaged in getting higher education. This helps the less advantaged to attain higher education, while helping the University realise its objective.,

      Dr.B.R.Ambedkar Open University (Dr.BRAOU) has issued admission notification for the Academic Year 2022-23 for UG/PG/PG Diploma & Certificate Programmes. The admission criteria for different programmes is subject to UGC guidelines and University Regulations. All the details required for getting admission in the University like details of Regional Co-ordination Centres (RCCs), list of Study Centres, Information about the programmes, required qualifications, admission process, Tuition Fee etc., are mentioned in the admission notification which is hosted in the University Website (www.braouonline.in) . For additional information the University can also be reached on the University Helpdesk Nos. 7382929570/580/590/600 (or) 040-23680281/283.

      As an educated alumnus of the University, you are requested to take part in realisation of the University’s objective of ‘reaching out to the unreached’ and be a partner with the University in this gigantic task.

      The University is actively considering the formation of an ALUMNI Association, with all the former students of University. who have now established themselves in different fields. In fulfilment of this objective, you are requested to mail your complete details like the present place of employment, Designation, Phone No., Complete Postal Address etc. to our e-mail ID :braoualmuni@gmail.com.

  Sd/-                    
  Dr AVN Reddy, Registrar, Dr.BRAOU

Alumni Association